telugu navyamedia
సినిమా వార్తలు

అతనికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు : సమీరా రెడ్డి

Sameera-Reddy

తెలుగులో స్టార్ హీరోలతో నటించిన సమీరారెడ్డి పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైనా, గర్భవతిగా ఉన్నప్పుడు ఫోటో షూట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవలే సమీరా రెడ్డి రెండవ కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. బిజినెస్‌మేన్ అక్షయ్ వర్ధిని 2014లో పెళ్లాడారు. వీరికి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. కాగా రెండోసారి సమీరా గర్భవతి అయిన తర్వాత సమీరా మాతృత్వంపై తన ఆలోచనలను, ప్రెగ్నెన్సీ ఫొటోలను పోస్ట్ చేశారు. కొన్ని రోజుల ముందు ఓ పాపకు జన్మనిచ్చారు. తాజాగా తన పాపకు “నైరా” అనే పేరుని పెట్టామని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. తాజాగా ఈ బ్యూటీ ఓ చాట్ షోలో భాగంగా నటిగా తాను ఎలా ఎదిగాననే విషయాన్ని సమీరా వివరించింది. “కెరీర్ ఆరంభంలో ఎవరి ముందైనా మాట్లాడాలంటే భయపడేదాన్ని. తరచుగా తడబాటుకు గురవడం నా బలహీనత. పలు సందర్భాల్లో ఆడిషన్స్ లో కూడా ఈ సమస్యని ఎదుర్కొన్నా. నా సమస్యని స్టార్ హీరో హృతిక్ రోషన్ గుర్తించాడు. ఆ సమస్యని అధికమించేందుకు ఓ పుస్తకం ఇచ్చాడు. తాను కూడా కెరీర్ లో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడట. ఆ పుస్తకం వల్ల నా కెరీర్ మలుపు తిరిగింది. జీవితమే మారిపోయింది అని సమీరా రెడ్డి వెల్లడించింది. ఆ పుస్తకాన్ని ఇప్పటికి నా వద్దే ఉంచుకున్నా. హృతిక్ రోషన్ కు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు” అని సమీరా రెడ్డి తెలిపింది.

Related posts