తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని, నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని గోల్కోండ ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ వార్డుల విభజన తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టిందని, జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్లు జరగాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తామని తెలిపారు. కొత్త మునిసిపాలిటీ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయని విమర్శించారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో 32 జిల్లాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్ మొదటి సంతకమే పెద్ద మాయ: నారా లోకేశ్