ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ వరల్డ్‌కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాని ఉహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై తాజాగా ధోనీస్పందిస్తూ “క్రికెట్‌కు తాను ఎప్పుడు గుడ్‌బై చెప్తాననే విషయంలో తనకే స్పష్టత లేదన్నారు. అయితే.. వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో ఆడే ఆఖరి లీగ్ మ్యాచ్‌కు ముందే తాను రిటైర్మెంట్ ప్రకటించాలని కొందరు కోరుకుంటున్నారు. ఈ విషయంలో జట్టు ఆటగాళ్లను కానీ, యాజమాన్యాన్ని కానీ నిందించడం లేదు” అని స్పష్టం చేశారు. అయితే ఇంగ్లడ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో ధోనీ ఆటతీరు లేదు. ముఖ్యంగా ఆఫ్గనిస్థాన్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో ధోనీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
previous post