ఇటీవలే వారి ప్రేమాయణం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు బాలీవుడ్ ప్రేమజంట అర్జున్ కపూర్, మలైకా అరోరా. దీంతో నెటిజన్లు మలైకాపై ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం మలైకా, అర్జున్ కపూర్ కు మధ్య దాదాపు 10 సంవత్సరాల వయసు గ్యాప్ ఉండడమే. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ నటి మలైకా అరోరా స్పందించింది. తాను మళ్లీ ప్రేమలో పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, ఇది మీకు సమస్యగా మారిందని, అసలు మీ బాధంతా తన ప్రియుడు అర్జున్ కపూర్ తన కంటే చిన్నవాడు కావడమేనని, అతడు చిన్నవాడైతే మీకొచ్చిన సమస్యేంటో తనకు అర్థం కావడం లేదని ఘాటుగా రిప్లై ఇచ్చిదని. ఇతరుల సమస్యల గురించి పట్టించుకునేంత తీరిక తనకు లేదని, ఎవరినో సంతోష పెట్టేందుకు తానిక్కడ లేనని, రిలేషన్షిప్లో వున్నప్పుడు వయసు తారతమ్యం పెద్ద సమస్య కాబోదని స్పష్టం చేసింది. తాను 17 ఏళ్ల వయసు నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని పేర్కొంది. తానో తల్లినని గుర్తు చేస్తూ, ఓ బిడ్డకు తల్లినైనంత మాత్రాన హాట్‌గా కనిపించకూడదా? అని ప్రశ్నించింది. సెక్సీగా ఉండడం తప్పెలా అవుతుందని నిలదీసింది. స్త్రీ అనగానే ఒకరికి భార్యగానో, మరొకరికి తల్లిగానో చూడకూడదని, తానో మాతృస్వామిక కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది మలైకా.
మూడు పెళ్లిళ్లు అయిన ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని… పూనమ్ కౌర్ పై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు