telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

తమిళనాడులో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె…చెన్నైలో నిలిచిపోయిన బస్సులు

Tamil-Nadu Buses

తమ వేతనాల్లో ఆర్టీసీ యాజమాన్యం కోత విధిందన్న అనుమానంతో తమిళనాడు రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఈరోజ చెన్నై నగరంలో తిరగాల్సిన బస్సు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. బస్సులు తిరగకపోవడంతో  విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 23 వేల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించారు. దీంతో రాష్ట్రానికి చెందిన 3,200 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

చెన్నై నగరాన్ని నీటి కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. నీటి సమస్య వేధిస్తున్న నేపథ్యంలో పత్య్రేక నిధులు సేకరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు జూన్‌ నెల వేతనాల నుంచి కోత విధించారన్న సమాచారం ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తకు బలం చేకూర్చినట్లు బ్యాంకు ఖాతాకు జమయిన వేతనాల మొత్తం తక్కువగా ఉండడంతో ఉద్యోగులు ఈ వార్త నిజమేనని భావించి మెరుపు సమ్మెకు దిగారు. కాగా, ఉద్యోగులు మెరుపు సమ్మెతో అధికారులు నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగారు. ఉద్యోగులు ఊహిస్తున్నట్లు వేతనాల్లో ఎటువంటి కోత విధించలేదని తెలిపారు.

Related posts