ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ఇటీవలే తుదిశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతని వ్యక్తిగత జీవితంలో బాలీవుడ్ నటి హేమామాలినికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ఉంది. హేమామాలిని 70వ దశాబ్దంలో ఇండస్ట్రీలో అత్యంత అందగత్తెగా పేరు సంపాదించారు. అప్పట్లో జితేంద్ర, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ మొదలైన పెద్ద నటులంతా ఆమె అందానికి ఫిదా అయిపోయారట. అయితే హేమమాలిని తల్లి తన కుమార్తెను గిరీష్ కర్నాడ్‌కు ఇచ్చి వివాహం చేయాలని భావించారు. ఈ విషయమై ఆమె గిరీష్ కర్నాడ్‌ను కూడా సంప్రదించారు. అయితే హేమమాలిని మాత్రం ధర్మేంద్రను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. తరువాత వారి వివాహం జరిగింది. కాగా గతంలో గిరీష్ కర్నాడ్ ఒక ఇంటర్వ్యూలో హేమామాలిని గురించి మాట్లాడుతూ తాను హేమామాలినిని ఎంతో గౌరవిస్తానని, ఆమె ఒక మంచి నటి అని కొనియాడారు. అయితే ఆమె రాజ్యసభ సభ్యురాలిగా విఫలమయ్యారని, రాజ్యసభలో ఆమె ఒక్క ప్రశ్నకూడా అడగకపోవడం శోచనీయమని అన్నారు.
previous post
next post
చరణ్ పై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్