ఏపీ అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా గత మూడేళ్లుగా సేవలు అందించిన దమ్మాలపాటి శ్రీనివాస్ పదవి నుంచి వైదొలిగారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.
మే 2016లో ఆంధ్రప్రదేశ్ ఏజీగా నియమితులైన ఆయన మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. వైసీపీ చీఫ్ జగన్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో దమ్మాలపాటి తన పదవి రాజీనామా చేశారు.


భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్: మోదీ