లోక్ సభలో ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ ఇది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. 21వ శతాబ్దంలో భారత అభివృద్ధిని పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉందని కితాబిచ్చారు.
ఈ బడ్జెట్ వల్ల పారిశ్రామికరంగం బలపడుతుందని, దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు. పన్ను విధానాన్ని సరళతరం చేశామని చెప్పారు. మౌలిక వసతులను ఆధునికీకరించేలా బడ్జెట్ ను తీర్చిదిద్దామని అన్నారు. వ్యవసాయరంగాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైనవి బడ్జెట్ లో పొందుపరిచామని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు.
సచివాలయాన్ని కూలగొట్టించడానికి కేసీఆర్ సిద్దమయ్యారు: రేవంత్ రెడ్డి