telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ధాకడ్” టీజర్.. ఫుల్ యాక్షన్ మోడ్ లో కంగనా

Dhaakad

బాలీవుడ్ క్వీన్ కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం “ధాకడ్”.రజినిష్ రాజి ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. కంగనా ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనపడుతున్నారు. ఒంటి నిండా గాయాలతో మిషన్‌గన్‌ని ఫైర్ చేస్తూ కనపడ్డారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ “టీజర్‌లో ఉపయోగించిన మిషన్‌గన్‌ నిజమైంది. దాన్ని ఉపయోగించాలంటే శక్తినంతా కూడ దీసుకునేదాన్ని. నేను పడే కష్టాన్ని చూసి డైరెక్టర్ నవ్వుకునేవారు. షూటింగ్‌లోనైనా డమ్మీ తుపాకీ ఉపయోగిస్తే బావుంటుందని ఆశిస్తున్నాను” అన్నారు. గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన కంగనా ఇప్పుడు బాక్సాఫీస్ క్వీన్‌గా మారింది. మణికర్ణికతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఈమె యాక్షన్ స్టార్‌గా కూడా అవతరించింది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts