ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే జనసేన ఖాతాలో చేరింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ దారుణంగా పరాజయం పాలవ్వడం జనసేన పార్టీకి మింగుడు పడని విషయమే. తాజాగా ఈ విషయంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. “గొప్ప నాయకులు కేవలం నాయకులుగానే మిగిలిపోరు, మార్పు అంటే ఏంటో చూపిస్తారు. ఇది ఓ పాత్రకు సంబంధించిన విషయం కాదు, ఇదంతా ఓ లక్ష్యానికి సంబంధించిన విషయం” అంటూ పోస్టు చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికీ, జనసేన పార్టీకి భేషరతుగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తన పోస్టు ద్వారా పేర్కొన్నారు.
next post
వై .సి .పి నాయకులను మూసుకొని కూర్చోమని చెప్పలేరా ?