telugu navyamedia
సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ సీక్రెట్ బయట పెట్టేసిన కత్రినా కైఫ్

Katrina-Kaif

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సెలబ్రిటీలంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కత్రినా కూడా రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయింది. ఈ రెండేళ్లలో ఆమె 21.5 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ అర్భాజ్ ఖాన్ నిర్వహించే “పించ్” అనే షోకి హాజరైంది. ఈ సందర్భంగా తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ గురించి ఓ సీక్రెట్ చెప్పేసింది. అర్భాజ్ “కత్రినా మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ఉందా..? వేరే వాళ్లను సీక్రెట్ గా ఫాలో అవుతుంటారా..?” అని ప్రశ్నించగా.. దానికి స్పందించిన ఆమె “లేదు.. లేదు.. కానీ రణబీర్ కు ఉంది.. అసలు ఈ ఇన్స్టా గ్రామ్ ఎలా పని చేస్తుందో నాకు చూపించిందే రణబీర్” అని చెప్పింది. రణబీర్ సంగతి అడగకుండానే కత్రినా అతడి సీక్రెట్ బయటపెట్టేయడం గమనార్హం.

ఇక అర్భాజ్ ఖాన్ “కత్రినా… నేను నిన్ను ఎంతగానే ప్రేమిస్తున్నాను. నువ్ లేకపోతే చచ్చిపోతాను.. నన్ను పెళ్లి చేసుకో.. నీ నెంబర్ ఇవ్వు” అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ని కత్రినాకు చూపించగా… ఈరోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు ఉన్నారని తెలియడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఈరోజుల్లో అందరూ పరిస్థితులకు అనుగుణంగా ఉండిపోతూ.. ఏదీ సీరియస్ గా తీసుకోవడం లేదని అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంలో కత్రినా తన పెళ్లిపై కూడా స్పందించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తెలియదు కానీ కచ్చితంగా చేసుకుంటాను. జీవితంలో ఏది ఊహించలేమని.. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఇక కత్రినా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి ‘భారత్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది జూన్ లో ఈద్ సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే అక్షయ్ కుమార్ తో ‘సూర్యవంశీ’ అనే సినిమాలో నటిస్తోంది. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు సైన్ చేసింది.

Related posts