సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. అయితే నయనతారకు మాత్రం ఇందుకు మినహాయింపుగా రానురాను మరింతగా క్రేజ్ పెరుగుతోంది. గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయాణం సాగించిన నయన్ ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో లవ్‌లో ఉంది. దాదాపు మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. బహిరంగంగా స్పందించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తమ బంధాన్ని బయటపెడుతూనే ఉన్నారు. వరుస సినిమా ఆఫర్ల వల్లే నయనతార ఇప్పటివరకు పెళ్లిపీటలు ఎక్కలేదు. కలిసి బయట తిరుగుతున్నప్పటికీ వీరు పెళ్లి విషయంలో మాత్రం తొందరపడడం లేదు. పెళ్లి చేసుకుంటే సినిమా అవకాశాలు తగ్గిపోతాయనేది నయన్ భయపడుతోందని టాక్. అయితే ఎట్టకేలకు నయన్ పెళ్లికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ ఏడాది నిశ్ఛితార్థం చేసుకుని వచ్చే ఏడాది పెళ్లిపీటలు ఎక్కాలని నయన్, విఘ్నేష్ అనుకుంటున్నారట. పెళ్లి లోపు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలన్నీ పూర్తి చేయాలని నయన్ భావిస్తోందట.
previous post