ప్రింటింగ్ ప్రెస్ చేసిన పొరపాటుతో సిడ్నీకి చెందిన డైలీ ఫొటోగ్రాఫ్ వార్తాపత్రికలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన రెండు టాబ్లాయిడ్ వార్తలు అనుకోకుండా ప్రింట్ అయ్యాయి. ఈ పొరపాటును గుర్తించిన పాఠకులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గురువారం నాడు వెలువడిన డైలీ ఫొటోగ్రాఫ్ పత్రికలో ద సండే హెరాల్డ్‌కు చెందిన టాబ్లాయిడ్ వార్తలను గమనించిన పాఠకులు ప్రింటింగ్ ప్రెస్‌తో పాటుగా వార్తలను కూడా పంచుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. రెండు పత్రికలు ప్రత్యర్థులు కావడం.. వీరిద్దరి మధ్యనే ఈ పొరపాటు జరగడంతో ఈ వార్త ట్రెండింగ్ అయ్యింది. దీనికి డైలీ ఫొటోగ్రాఫ్ యాజమాన్యం ట్విటర్లో క్షమాపణలు తెలిపింది. ఒకే ప్రింటింగ్ ప్రెస్‌లో రెండు సంస్థలకు చెందిన పేపర్ ప్రింట్ కావడంతో ఈ తప్పు జరిగిందని వివరించింది. ఈ ట్వీట్‌పై స్పందించిన సండే హెరాల్డ్ జర్నలిస్ట్ కేట్ మెక్క్లెమాంట్.. క్షమాపణలు అవసరం లేదని పాఠకులకు రెండు పేజీలు బోనస్‌గా వచ్చాయి అంతే అంటూ హాస్యంగా ట్వీట్ చేశారు.
previous post
next post