telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాక్సిడెంట్ వార్తలపై స్పందించిన తరుణ్

tarun tollywood

ఈరోజు ఉదయం హైదరాబాద్ ఔటర్‌ రింగ్ రోడ్డు నార్సింగి పరిధిలోని అల్కాపూర్‌‌లో ప్రముఖ టాలీవుడ్ హీరో తరుణ్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో తరుణ్ కు పెద్దగా గాయాలు కాకుండా బయటపడ్డాడని, కారు ప్రమాదం తరువాత, తరుణ్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి, మరో కారును తెప్పించుకుని వెళ్లిపోయాడని, ఈ ప్రమాదంలో తరుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ విషయమై తరుణ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని తరుణ్ అధికారికంగా వెల్లడించారు. యాక్సిడెంట్ వార్త అవాస్తవమని, యాక్సిడెంట్ అయిన కారుకి, తనకు ఎలాంటి సంబంధం లేదని, రాత్రి నుండి తాను ఇంటి వద్దే ఉన్నానని, తన కారు కూడా క్షేమంగానే ఉందని తెలిపారు. ఇక తరుణ్ గతేడాది “ఇది నా లవ్ స్టోరీ” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ సినిమా ఫ్లాఫ్ గా మిగిలింది.

Related posts