వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రం “సూర్యకాంతం”. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్లో మరో అందమైన హీరోయిన్ కన్పించింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఎవరనే ఆసక్తి కలిగింది అందరిలో. ఈ సినిమాలో రాహుల్ విజయ్ సరసన మరో కథానాయికగా నటించిన బ్యూటీ పేరు “పెర్లిన్ భెసానియా”. ఈ ముంబై ముద్దుగుమ్మ చాలా యాడ్స్ చేసింది కానీ తెలుగులో మాత్రం ఇదే తొలి సినిమా. తాజాగా ఈ హీరోయిన్ స్పందిస్తూ “నిజానికి నాకు తెలుగు రాదు. హిందీలో డైలాగ్స్ రాసుకుని చెప్పాను. ఈ సినిమాలో నేను చేసిన ‘పూజ’ పాత్ర నాకు మంచి క్రేజ్ తీసుకొస్తుందని అనుకుంటున్నాను. నిహారికతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విడుదలకాకముందే వరుస అవకాశాలు రావడం సంతోషాన్ని కలిగిస్తోంది” అని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా రావడంతో సినిమాకు హైప్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సూర్యకాంతం” చిత్రం మార్చి 29న విడుదల కానుంది.
previous post
అది లేకపోతే..నగ్నంగా అనిపిస్తుందట!