ఏపీలో నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ పండుగ వాతావరణంలో జరిగింది.
సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన జరిగే ఈ కార్యక్రమం.. రేపు (జనవరి 1వ తేదీ) సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే వాలంటీర్లు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేయగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి రికార్డు స్థాయిలో 87 శాతం పంపిణీ పూర్తయింది.
ఈ నెలలో మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.2,743 కోట్లు విడుదల చేసింది.
ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పింఛన్ల కోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని, కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు.


చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్