ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసింది.
9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామని తెలిపింది. గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు.
పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసింది.
మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం కలిపి జిల్లా చేశామని తిరుపతిలో కలవాలని రైల్వేకోడూరు ప్రజలు ఎప్పట్నుంచో కోరుతున్నారని మంత్రులు వివరించారు.
బనగానపల్లె, అడ్డరోడ్డును డివిజన్లగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేర్పులు, మార్పులన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుందన్నారు. జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లెగా ఉంటుందని వెల్లడించారు.
రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి మార్చేందుకు కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఆదోనిని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పరిపాలన సౌలభ్యం కోసమే రాయచోటిని మార్చారని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

