telugu navyamedia
ఉద్యోగాలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ నుండి యూపీఎస్సీ మెయిన్స్-2025 ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణ నుంచి యూపీఎస్సీ మెయిన్స్ – 2025 ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

సివిల్స్​ సాధించాలన్న లక్ష్యంతో పరీక్షలకు సిద్ధమయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం గ‌త ఏడాది రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని ప్రారంభించి అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.

అందులో భాగంగా ఈ ఏడాది కూడా సింగరేణి సంస్థ అధ్వర్యంలో 202 మందికి 1 ల‌క్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించింది.

తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన మెయిన్స్ ఫలితాల్లో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది విజేతలుగా నిలిచారు.

మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు గ‌తేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంట‌ర్వ్యూల‌కు స‌న్న‌ద్ధం అయ్యేందుకు మ‌రో ల‌క్ష రూపాయ‌ల చొప్పున ప్రోత్సాహ‌కం అందించ‌నున్నారు.

Related posts