telugu navyamedia
National ఆంధ్ర వార్తలు క్రీడలు రాజకీయ వార్తలు

ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ఫ్యామిలీతో హాజరైన మంత్రి నారా లోకేష్

ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరల్డ్ కప్ ట్రోపీ కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడ్డాయి.

ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు, పలువురు భారత క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు.

ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా హాజరయ్యారు.

లోకేష్‌తో పాటు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ కూడా ఉన్నారు. ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్‌కు ఫ్యామిలీతో కలిసి హాజరైన ఫొటోలను లోకేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఈ సందర్బంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌ను కూడా లోకేష్ ఫ్యామిలీ కలిసింది. ఈ సందర్భంగా సచిన్‌తో దిగిన ఫొటోలను కూడా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

భారత జట్టుకు మద్దతు తెలపడం, మహిళల క్రికెట్ ఎదుగుదలను వేడుక చేసుకోవడం గర్వంగా ఉంది అని లోకేష్ అన్నారు.

Related posts