భారత పారిశ్రామికవేత్త రతన్ టాటా వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవల్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఉదయం తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ఖాతాలో చేసిన ఒక పోస్ట్‌లో రతన్ టాటాను స్మరించుకున్నారు.
‘శ్రీ రతన్ టాటా మృతి చెంది ఏడాదవుతోంది. ఆయన పారిశ్రామిక దిగ్గజం. కరుణామయ మానవతావాది, ఒక దార్శనికుడు, ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు శాశ్వతంగా స్ఫూర్తినిస్తుంది యువతకు మార్గనిర్దేశం చేస్తుంది.’ అని చంద్రబాబు పోస్ట్ చేశారు.
కాగా, రతన్ టాటా (1937-2024)టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజం. ఆయన అక్టోబర్ 9, 2024 న పరమపదించారు.
రతన్ టాటా భారత దేశానికి చేసిన సేవలు, దాతృత్వం, ఆవిష్కరణలు భారత దేశం మొత్తం ఆయన్ను ఎల్లకాలం స్మరించుకునే స్థాయికి తీసుకెళ్లాయి.
బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు