మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలకు ఊరట లభించింది. హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది సెషన్స్ కోర్టు.
బుధవారం కొన్ని షరతులతో బెయిల్‌పై విడుదల చేసేందుకు అనుమతించింది. బెయిల్‌పై ఉన్న సమయంలో మళ్లీ ఇదే నేరాన్ని పునరావృతం చేయరాదని, ఈ కేసుకు సంబంధించిన ఏ అశంపైన మీడియాతో మాట్లాడరాదని సెషన్స్ కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో పోలీసులకు సహకరించాలని అన్నారు.
వారిని ప్రశ్నించాలనుకుంటే.. 24 గంటల ముందే నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే నవనీత్ కౌర్ దంపతులకు 50 వేల పూచీకత్తు పై జస్టిస్ ఆర్ఎన్ రోకడే ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
సీఎం ఉద్దవ్ థాక్రే ప్రైవేటు నివాసమైన ‘మాతోశ్రీ’ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ రాణా దంపతులు బహిరంగ ప్రకటన చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ క్రమంలో ఏప్రిల్ 23వ తేదీన ఖర్ స్టేషన్ పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు మోదీ: ప్రియాంక గాంధీ