ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
సముద్ర కాలుష్యం కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు పవన్ ఈ పర్యటన చేస్తున్నారు.
స్థానిక ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వ్యర్థ రసాయనాలు వదులుతున్నాయంటూ మత్స్యకారులు సెప్టెంబర్లో వివిధ రకాల ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో కూటమి ప్రభుత్వం 5 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ ఈ ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారుల ప్రతినిధులు, ఇండస్ట్రీస్, ఫిషరీస్ కమిషనర్లు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ ప్రాంతం పరిశీలించేందుకు సముద్రంలో ప్రయాణించనున్నారు.
మధ్యాహ్నం 2 గం.కు పిఠాపురం నియోజక వర్గం ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.