telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

వారంలో రెండు రోజుల పాటు సిట్ విచారణకు హాజరవడంతో పాటు, రెండు షూరిటీలు, రూ. 2 లక్షల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని సాక్షులను బెదిరించరాదని సహనిందితులతో కేసు గురించి మాట్లాడరాదని వాట్సాప్ నెంబరు, ఆధార్, ఈమెయిల్ ఐడీ వివరాలు పోలీసులకు అందించాలని కోర్టు తన షరతుల్లో పేర్కొంది.

లిక్కర్ కేసులో జులై 20న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత71 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.

ఈరోజు ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత రేపు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.

ఇప్పటికే ఈ కేసులో ఏ31 ధనుంజయరెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలు బెయిల్ పొందారు.

Related posts