telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను నేడు విడుదల చేసింది

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను నేడు విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి.

ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం.

ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వివరాలు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. టైమ్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని వివరించారు.

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఖాళీ వివరాలు గెజిట్ నోటిఫికేషన్ నిన్న(ఆదివారం) తమకు అందిందని వెల్లడించారు.

ఓటర్ల జాబితాను వార్డు, గ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారిగా పబ్లిష్ చేశామని తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అధికారులు ప్రక్రియ పూర్తి చేశారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు.

Related posts