ఏపీ శాసనసభలో శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గతంలో పోలీసులను అతిగా ఉపయోగించండం జరిగిందని దానికి నిదర్శనమే 151 నుంచి 11 సీట్లకు జగన్ మోహన్ రెడ్డి పడిపోయారని అన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్‌తో పాటు పలువురుపైనా పోలీసులను ప్రయోగించారని గుర్తుచేశారు. చాలా మందికి తాము ఎందుకు జైలుకు వెళుతున్నామో కూడా తెలియని పరిస్ధితి అప్పట్లో ఉండేదన్నారు.
శాంతిభద్రతలను కాపాడడానికి ఎంతో ప్రయత్నించామని ఈ ఏడాది రాష్ట్రంలో 16 శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు.
బలహీన వర్గాలు, మహిళలపై నేరాల సంఖ్య రాష్ట్రంలో తగ్గిందని సభకు తెలియజేశారు.
విపరీతంగా గంజాయి పెరిగిపోయిందని గతంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉండేవని చివరకు స్కూళు బ్యాగుల్లోకి కూడా గంజాయి చేరిపోయిందన్నారు.
గత అయిదేళ్లు ప్రభుత్వంలో నిఘా విఫలం అయ్యిందని చెప్పడానికి కారణం గంజాయి విపరీతంగా పెరిగిపోవడమని వెల్లడించారు.
లిక్కర్ రేటు పెరిగిపోవడంతో గంజాయిని చాలా మంది మత్తు కోసం ఆశ్రయించారని హోంమంత్రి తెలిపారు.
సెబ్‌ను రద్దు చేసి ఈగల్ అనే వ్యవస్ధను ఏర్పాటు చేసి ఐపీఎస్ అధికారితో పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఈరోజు గాంజా కల్టివేషన్ రాష్ట్రంలో జీరోకి చేరిందని పేర్కొన్నారు.
జనవరి 1 నుంచి ఈరోజు వరకు 32 వేల కేజీల గాంజాను సీజ్ చేశామని సభలో వెల్లడించారు.
మెడికల్ షాపులలో డ్రగ్స్‌కు సబంధించినవి దోరుకుతున్నాయని సభ్యులు తమ దృష్టికి తెచ్చారని దీనికి వ్యతిరేకంగా ఆపరేషన్ గరుడా, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని నడిపామని తెలిపారు.
40 వేల బడ్డీలపై రైడ్ చేశామని ఆపరేషన్ చైతన్య, సంకల్పలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నామన్నారు.
గత అయిదేళ్లు మహిళల క్యారెక్టర్‌ను దిగజార్చి మాట్లాడారని మండిపడ్డారు. ఉమెన్, ఛైల్డ్ సేప్టీకి ఒక మహిళా ఐపీఎస్‌ను పెట్టి శక్తి యాప్‌ను ఏర్పాటు చేశామని అన్నారు.
ఒక అమ్మాయి.. ఇబ్బందుల వల్ల రైలు పట్టాలవైపు వెళుతుంటే అది చూసిన వారు శక్తి బృందానికి సమాచారం ఇచ్చారని ఆ బృందం వెళ్లి ఆ అమ్మాయిని రక్షిస్తే ఆమె ఇప్పుడు డీఎస్సీ రాసి ఉద్యోగం సాధించారని హోంమంత్రి అనిత తెలియజేశారు.
నేను ముందే పార్టీకి రాజీనామా చేశా..నన్ను సస్పెండ్ చేయడమేంటి?