telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేటి నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక విచారణ ప్రారంభించిన సీబీఐ

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ (CBI) అధికారులు నేడు ప్రాథమిక విచారణను ప్రారంభించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కోరిన దర్యాప్తు నేపథ్యంలో సీబీఐ అధికారులు ప్రాథమిక పరిశీలన ప్రారంభించారు.

NDSA రిపోర్ట్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్స్‌పై సీబీఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సీబీఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Related posts