telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ మంత్రి సీతక్క రిక్వెస్ట్‌ తో కొత్తగూడ మండల కేంద్రంలో ని రోడ్ల విస్తరణకు రేవంత్ సర్కార్ రూ.12 కోట్లు కేటాయించింది

రేవంత్ సర్కార్ మంత్రి సీతక్క చేసిన రిక్వెస్ట్‌ని మన్నించి ఆ ప్రాంతంలో రోడ్లను వెడల్పు చేసేందుకు రూ.12 కోట్లు కేటాయించింది.

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండల కేంద్రంలోని రోడ్ల విస్తరణకు రేవంత్ సర్కార్ తాజాగా ఆమోదం తెలిసింది.

ఈ ప్రాంతంలో రోడ్లు వెడల్పు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో  ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీర్లు రోడ్ల విస్తరణ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

దీనిలో భాగంగా ఇల్లందు రోడ్డు 48వ కిలోమీటర్ రాయి నుంచి నర్సంపేట వైపు ఉన్న 50వ కిమీ రాయి వరకు రోడ్డును వెడల్పు చేయనున్నారు.

దీంతోపాటు గుంజేడు రోడ్డులో డంపింగ్ యార్డ్ వరకు రోడ్డును వెడల్పు చేయనున్నారు.

అలానే ఓటాయి రోడ్డు విషయానికి వస్తే.. భూర్కపల్లి వాగు వంతెన వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు.

ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రహదారిని 4 వరుసలుగా విస్తరించి మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు.

ఈ రహదారుల వెడల్పుకు ప్రత్యేక చొరవ చూపినందుకు గాను మంత్రి సీతక్కకు జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Related posts