telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్​ అఫైర్స్​ ఫోరం సదస్సులో “తెలంగాణ రైజింగ్ 2047” అనే ప్లాన్‌ను వివరించిన రేవంత్ రెడ్డి

ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్​ అఫైర్స్​ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి “తెలంగాణ రైజింగ్ 2047” అనే ప్లాన్‌ను వివరించారు.

తెలంగాణను 2035 నాటికి $1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి $3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టంగా వెల్లడించారు.

తెలంగాణను అత్యాధునిక హంగులతో 2047 నాటికి దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన ప్రతిజ్ఞ అని ముఖ్యమంత్రి చెప్పారు.

రకరకాల పరిశ్రమలు, శాశ్వత అభివృద్ధి, ఇన్నోవేషన్ హబ్‌లు, ఫ్యూచర్ రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం వంటి అంశాలు ప్రాధాన్యంగా ఉంటాయని వివరించారు.

మెట్రో రైలు వ్యవస్థను మరింతగా విస్తరిస్తున్నామనీ.. దేశంలోనే అత్యుత్తమ మెట్రో తెలంగాణలో ఉందని తెలిపారు.

అలాగే మౌలిక రంగాల కల్పనలో తెలంగాణ దూసుకెళ్తోందనీ త్వరలోనే మూసీ రివర్ ఫ్రంట్ కూడా రాబోతోందని తెలిపారు.

అలాగే ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామనీ.. 2027 నాటికి హైదరాబాద్‌లో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు నడిచేలా చేస్తామని తెలిపారు.

Related posts