ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.
గురువారం (జులై 23) రాత్రి నుంచే ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ పడగా, ఉదయం నుంచి రెగ్యులర్ షోస్ కూడా పడ్డాయి.
పవన్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు.
‘‘పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూసిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు.
మిత్రుడు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా చరిత్రాత్మక కథాంశంతో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా.
డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నా’అని చంద్రబాబు పేర్కొన్నారు.
అంతకు ముందు మంత్రి నారా లోకేష్ పవన్ సినిమాకు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పారు. హరి హర వీరమల్లు సినిమా భారీ విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
‘మా పవన్ అన్న సినిమా హరి హర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు.
పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం.
పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు నారా లోకేశ్.
నేను ఎప్పుడూ వేధింపులు ఎదుర్కోలేదు : అనుష్క