telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేత ముద్రగడం పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వైసీపీ నేత ముద్రగడం పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.

ఈ క్రమంలో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాకినాడ ఆసుపత్రిలో ఆయనకు డయాలసిస్ ట్రీట్మెంట్ చేశారు.

హైదరాబాద్ కు వెళ్లే ముందు కిర్లంపూడిలోని తన ఇంటికి వెళ్లాలని ఉందని ముద్రగడ కోరారు. దీంతో, ఆయనను కాకినాడ నుంచి కిర్లంపూడికి తీసుకెళ్లారు.

ఇంటి దగ్గర కొన్ని నిమిషాల పాటు ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను బంధువులు, సన్నిహితులు, అభిమానులు పరామర్శించారు.

త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.  ముద్రగడను రోడ్డు మార్గం ద్వారా ఆయనను అంబులెన్సులో హైదరాబాద్ కు తరలించారు.

Related posts