ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ .. కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారనే భయంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా? అని ప్రశ్నించారు.
దమ్ముంటే రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతా అని అన్నారు.
ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఏపీ మంత్రి లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి? అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
లోకేష్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. లోకేష్‌ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.
రేవంత్ ప్రెస్‌మీట్‌కు యువత దూరంగా ఉండాలను సూచించారు. రేవంత్ పిరికి సన్నాసాని.. చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని ఫైరయ్యారు.
రేవంత్‌రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని… చిట్‌చాట్‌లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్‌లా తాను దొంగను కాదని.. సంచులు మోయలేదని సెటైరికల్ పంచ్ వేశారు.
బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి.. ఢిల్లీలో కలిసి దొరికారని అన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు.
ఢిల్లీలో దొరికిన దొంగ అటెన్షన్ డైవర్షన్ కోసమే పిచ్చివాగుడు వాగుతున్నదని సీఎంపై నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.