telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ రోజు సీఎం చంద్రబాబు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పర్యటించనున్నారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొవ్వూరు సమీపంలోని మలకపల్లి గ్రామానికి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

సీఎం రాక కోసం అధికారులు ఇప్పటికే మలకపల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related posts