telugu navyamedia
pm modi ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఎంపిక

ఏపీలో బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌ గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు.

కాగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ కాసేపట్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.

ఇక బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం అధికారికంగా నిర్వహించనున్నారు.

ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్‌ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.

మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ కుటుంబానికి తొలినుంచి బీజేపీతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి చలపతిరావు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.

1986 నుంచి 88 వరకూ AP బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్‌ తండ్రి చలపతిరావే ఉన్నారు. మాధవ్‌ కూడా RSS హార్డ్‌కోర్‌గా ఉండడం ఇప్పుడు కలిసొచ్చిందనే అంటున్నారు.

గతంలో మాధవ్‌ ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం AP బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా కూడా మాధవ్‌ పనిచేశారు.

వివాదరహితుడు, పార్టీ గళం బలంగా వినిపించే నేతగా మాధవ్‌కు ఉన్న పేరు ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికకు సహాయపడింది.

Related posts