ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే 10వేలపైగా ప్రాణాలను బలి తీసుకుంది. 2లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకింది. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య 200దాటింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశమైన భారత్ కూడా కరోనాపై యుద్ధం ప్రకటించింది. అయితే ఇది పూర్తిగా ప్రజాస్వామ్య యుద్ధం. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కరోనా అంత ప్రభావం చూపలేదని కొందరు వాదిస్తున్నారు. ఇది నిజమే కావచ్చుగానీ, నిర్లక్ష్యం వహించొద్దంటూ సాక్షాత్తు ప్రధాని మోదీనే కోరారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కరోనాపై అందరూ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని ప్రజలకు సూచించారు. జనతా కర్ఫ్యూ అంటే ఎవరికి వారే ఇంటి వద్ద ఐసోలేట్ కావడం, సామాజిక దూరం పాటించడం. ఈ జనత కర్ఫ్యూ వల్ల చాలా లాభాలున్నాయని, కరోనాపై విజయం సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులంటున్నారు. ఎందుకంటే ఇటీవల న్యూఇంగ్లాండ్ అనే ప్రముఖ జర్నల్‌లో ఓ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం కరోనా వైరస్ గాల్లో 3గంటలు, రాగి పాత్రలపై 4గంటలు, కార్డ్‌బోర్డులపై 24గంటలు, స్టీల్ పాత్రలపై 2-3రోజులు, ప్లాస్టిక్ వస్తువులపై 4రోజులు బతుకుతుంది. ఇదిలా ఉండగా, బహిరంగ ప్రాంతాల్లో ఈ వైరస్ 12గంటలపాటు బతికే ఉంటుందంటూ మరోపక్క ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వల్ల కూడా జనతా కర్ఫ్యూ ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే కర్ఫ్యూ నిర్వహించే సమయం 14 గంటలు. అంటే కర్ఫ్యూ పూర్తయ్యేసరికి సదరు ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం పోతుందన్నమాట. కాబట్టి అందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొని ఇంటికే పరిమితమవ్వాలని నిపుణులు చెప్తున్నారు. అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని, మన ప్రధాని మోడీ గారి ఉద్ధేశ్యం! ఇది మన కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం! అందరం భాగస్వాములౌదాం! గుడికెళ్ళొద్దా ? మాంసం కొనుక్కోవద్దా ? అనకండి శనివారం అన్నీ సమకూర్చుకోండి. ఇంట్లోనే ప్రార్ధించడం చేయండి అందరూబాగుండాలి అందులో మనముండాలి.
previous post
next post
బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీల పై కేశినేని సంచలన వ్యాఖ్యలు