ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తు కాదని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
“అడవులను కాపాడుకోవాలి. జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ఒక్కరోజే ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి.
మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది. అందుకే స్వచ్ఛ భారత్‌లో భాగంగా మనం స్వఛ్చాంధ్ర కార్యక్రమం చేపట్టాం. చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నాం.
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలన అంశాన్ని థీమ్‌గా తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా పని చేద్దాం.
పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకుందాం” అని చంద్రబాబు ‘ఎక్స్’ లో రాసుకొచ్చారు.
ఈరోజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు.


ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు..టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్!