telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి పునఃప్రారంభం రాష్ట్ర వృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.

ఈ పనులను ప్రారంభించడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే, ముఖ్యమైన రోజు అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.

“ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమైన, ముఖ్యమైన రోజు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ
మన ప్రజల రాజధాని అభివృద్ధిని తిరిగి ప్రారంభించడానికి అమరావతికి వస్తున్నారు.

అమరావతి మన ఉమ్మడి ఆశలు, కలలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ పునఃప్రారంభం మన రాష్ట్ర వృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది” అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Related posts