telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం

Gongidi Sunitha mla trs

ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెను ప్రమాదం తప్పింది. భవనం పెచ్చులూడి పడటంతో ఎమ్మెల్యే, మరో ఇద్దరు సర్పంచులు గాయపడ్డారు. ఆలేరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సర్పంచులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సునీత చేతికి పెచ్చు తగిలి గాయమైంది. సర్పంచ్ లక్ష్మికి తలపై తీవ్రగాయాలు కాగా ఇందిరకు స్వల్ప గాయలు అయ్యాయి. గాయపడ్డ ఇద్దరినీ ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related posts