telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : కేకేఆర్ టార్గెట్ ఎంతంటే…?

కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు షాక్ ఇచ్చింది కేకేఆర్. మొదట ఆ జట్టు కెప్టెన్ రాహుల్ (19) ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 34 బంతుల్లో 31 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత ఆ జట్టు కష్టాలో పడింది. అయితే టాప్ ఆర్డర్ మొత్తం నిరాశపరిచిన చివర్లో క్రిస్ జోర్డాన్ (30) రాణించడంతో పంజాబ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఇక కోల్‌కత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 3 వికెట్లు తీయగా సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్ రెండేసి వికెట్లు, శివం మావి, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలవాలంటే 124 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్ లోనైనా కోల్‌కత విజయం సాధిస్తుందా… లేదా అనేది చూడాలి.

Related posts