ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్న దానిపై తాజాగా చాల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.
అయితే ఇందులో ఎవరూ కూటమి సునామీని ఊహించలేదు.
కేకే సర్వే మాత్రం కూటమి ఏకపక్ష విజయాన్ని అంచనా వేసింది. ఎవరూ ఊహించని స్ధాయిలో కూటమి ఏకంగా 160 సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే మాత్రమే అంచనా వేసింది.
పలు జాతీయ, లోకల్ సర్వేలకు భిన్నంగా కేకే సర్వే వేసిన అంచనా నిజమైంది.