telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్.. లోక్ సభలో స్థానం మార్పు!

raghurama krishanam raju

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న ఆయన పై పార్టీ హైకమాండ్ మరో నిబంధన విధించింది. లోక్ సభలో ఆయన కూర్చునే స్థానాన్ని మార్పించింది. ప్రస్తుతం నాలుగో లైన్ లో కూర్చుంటున్న రఘురాజు సీటు ఏడో లైన్ లోకి మారుస్తూ లోక్ సభ అధికారులు ఉత్తుర్వులు జారీ చేశారు.

వైసీపీ లోక్ సభ పక్షనేత సూచన మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. రఘురామకృష్ణరాజు సీటును మార్గాని భరత్ కు కేటాయించారు. రఘురాజును 376 నంబర్ సీటు నుంచి 445 సీటుకు మార్చారు. భరత్ ను సీట్ నంబర్ 385 నుంచి 379కి మార్చారు. కోటగిరి శ్రీధర్ ను 421 నుంచి 385కి మార్చారు. బెల్లన చంద్రశేఖర్ సీటును 445 నుంచి 421కి మార్చారు.

Related posts