telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇన్‌స్టాగ్రామ్ వైరల్ వీడియో.. టీచర్ తో కలసి విద్యార్థి సరదాగా డ్యాన్స్

ఫేర్ వెల్ పార్టీలో ఓ విద్యార్థితో కలసి స్కూల్ టీచర్ సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఇన్ స్టా గ్రామ్ ను ఊపేస్తోంది.

“కుషల్ ఎంజే” పేరుతో ఓ యూజర్ అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 1.3 కోట్లకుపైగా వ్యూస్, 10 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.

ఆ వీడియోలో చీరకట్టులో ఉన్న ఓ టీచర్ తన విద్యార్థితో కలసి బాలీవుడ్ చిత్రం ఆషికీ–2లోని ‘తుమ్ హి హో’ పాటకు డ్యాన్స్ చేయడం కనిపించింది.

వారు డ్యాన్స్ చేస్తుండగా పక్కనున్న విద్యార్థులు తమ అరుపులు, కేకలతో మరింతగా ఉత్సాహపరిచారు.

ఈ వీడియో చూసిన చాలా మంది ఆ విద్యార్థిని అదృష్టవంతుడిగా అభివర్ణించారు.

అతను నా కలను అనుభూతి చెందుతున్నాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ టీచర్ తో డ్యాన్స్ చేయాలన్న కల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో యూజరేమో ‘నా స్కూల్ ఇలా ఎందుకు లేదు సోదరా?’ అని ప్రశ్నించాడు. ఇంకొకరేమో ఆ టీచర్ కచ్చితంగా ఇంగ్లిష్ మేడం అయ్యుంటుందన్నాడు.

Related posts