telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదు..

జాతీయ రైతు సంఘాల నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో రెండో రోజు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి 26 రాష్ట్రాల రైతు 26 రాష్ట్రాలకు చెందిన 100 మందికిపైగా రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు

దేశంలో వ్యవసాయ రంగం, రైతులు ఏదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగ సమస్యలకు కారణాలు, వాటి పరిష్కారం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రైతు సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, విధానాలను కూడా జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ వివరిస్తున్నారు.

శనివారం కూడా సీఎం కేసీఆర్ జాతీయ రైతు సంఘాలతో సమావేశం అయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ప్రజల కోరికలను సంపూర్ణంగా నెరవేర్చలేదని కేసీఆర్ అన్నారు.

CM KCR Holds Meeting with farmers union leaders on second day

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను ఇప్పటికైనా మనం సమగ్రంగా అన్వేషించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు సీఎం కేసీఆర్‌.

ప్రజల కోసం పని చేసే వారిని దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వాడుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే అవకాశం ఉన్నా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, కేంద్ర ప్రభుత్వ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపు ఇచ్చారు.

శుక్రవారం వీరంతా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌, సింగాయపల్లిలో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్‌కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు, దేశ వ్యవసాయ రంగంలో రావాల్సిన మార్పులు, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సీఎం కేసీఆర్‌ వారికి వివరించారు. వారి అభిప్రాయాలను కూడా సీఎం కేసీఆర్ విన్నారు.

Related posts