telugu navyamedia
సినిమా వార్తలు

భారీ ఆఫర్‌ను వదులుకున్నా..కన్నీటిపర్యంతమైన ఛార్మి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా లైగ‌ర్ . ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తుంది.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ పెంచేశాయి.

Liger Pre Release Event: రౌడీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడంటే..

ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.

పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే నార్త్, సౌత్ ప్రధాన నగరాల్లో లైగర్ ఫ్యాన్‏డమ్ ఈవెంట్స్ నిర్వహించి అభిమానులకు దగ్గరయ్యారు లైగర్ చిత్రయూనిట్.

ఇందులో భాగంగా తాజాగా విజయ్‌, పూరి జగన్నాథ్‌లను ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పూరి జగన్నాథ్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేశారు.

Liger From Fans For Fans Special Interview By Charmme Kaur - Sakshi

ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఛార్మి అడిగారు. ఇక లాక్‌డౌన్‌ టైంలో ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీగా ఆఫర్‌ వచ్చినా వదులుకున్నాననని, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసినట్లు చెబుతూ ఛార్మీ ఎమోషనల్‌ అయ్యింది.

Related posts