ఫిదా’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి తెలంగాణ యాసతో తన నటనతో తెలుగు ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ‘లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను మరింత దగ్గరైంది. తన న్యాచురల్ యాక్టింగ్ తో, తన అద్భుతమైన డ్యాన్సులతో, బయట తన మంచితనంతో చాలా మంది అభిమానులును సొంతచేసుకుంది.
తాజాగా రానా దగ్గుపాటి, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న (ఆదివారం) కర్నూలులో నిర్వహించారు.
అయితే విరాట పర్వం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం వర్షం, ఈదురు గాలుల కారణంగా అర్దాంతరంగా ముగిసింది. మొదట వాతావరం బాగానే ఉన్నా తర్వాత వర్షం, ఈదురు గాలులు మొదలయ్యాయి. అయితే అవి తగ్గాక మళ్ళీ ఈవెంట్ మొదలు పెడదాం అనుకున్నారు. కానీ అది తగ్గేలా లేదని ఈవెంట్ ని అర్దాంతరంగా ఆపేశారు.
అయితే సాయి పల్లవిని చూడటానికి ఈ ఈవెంట్ కి కర్నూల్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. దీంతో అభిమానులని నిరాశపరచొద్దని సాయి పల్లవి ఆ వర్షంలోనే స్టేజిపైకి ఎక్కి మాట్లాడింది. అభిమానులు కూడా సాయి పల్లవి కోసం అలాగే వర్షంలో ఉన్నారు. సాయి పల్లవి మాట్లాడుతుంటే రానా, నవీన్ చంద్ర ఆమెకు గొడుగు పట్టుకున్నారు.
అయితే అక్కడ సాయిపల్లవి మాట్లాడిన మాటలు వినపడినా వర్షం వల్ల ఏర్పడ్డ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సాయిపల్లవి మాట్లాడింది రికార్డ్ అవ్వలేదు, టెలికాస్ట్ అవ్వలేదు. అయినా అక్కడికి వచ్చిన అభిమానులు సాయి పల్లవిని చూశాము అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈవెంట్ అనంతరం అంతటి గాలివానలో అభిమానులు ఎలా తిరిగి వెళ్లారోనని తాజాగా ట్వీట్ కూడా చేసింది సాయి పల్లవి. ‘నన్ను క్షమించండి. ఈరోజు మీ అందరినీ కలవాలని నేను నిజంగా ఎదురు చూశాను.
మనం త్వరలో మళ్లీ కలుద్దాం..వర్షం కురుస్తున్నప్పటికీ తిరిగి వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీరందరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారని ఆశిస్తున్నాను.’ అని పేర్కొంది.
విజయ్ దేవరకొండపై వ్యాఖ్యలు… బాలీవుడ్ నటుడికి ఆనంద్ కౌంటర్