telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఆషాడ బోనాల జాతర ప్రారంభం ..ఈ నెల 30న గోల్కొండలో అమ్మ‌వారికి తొలి బోనం

హైదరాబాద్ న‌గ‌రంలో ఆషాడ బోనాల సందడి ప్రారంభం కానుంది. ఈ మేర‌కు  ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి.

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి బోనాల వేడుక‌పై స‌మీక్ష నిర్వ‌హించి, తేదీల‌ను ఖరారు చేశారు.

అనంతరం వివరాలను మంత్రి తలసాని మీడియాకు వెల్లడించారు.  బోనాల పండుగను ఘ‌నంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని యాదవ్ తెలిపారు.

ఈ నెల 30న గోల్కొండ అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించ‌డంలో ఆషాలు బోనాలు ప్రారంభమవుతాయని అన్నారు. జూలై 17న సికింద్రాబాద్  ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు.. మరుసటి రోజు జూలై 18న రంగం కార్యక్రమంలో భవిష్యవాణి ఉంటుంది. జూలై 24వ తేదీన భాగ్యనగర బోనాలు, అదే నెల 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు నిర్వహిస్తారు. జూలై 28వ తేదీన గోల్గొండ బోనాలతో ఉత్సవాలు ముగుస్తాయ‌ని త‌ల‌సాని తెలిపారు. 

బోనాల పండుగను గొప్పగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నగరంలో చిన్నా పెద్దా తేడా లేకుండా 3 వేల కు పైగా దేవాలయాలకు 15 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకొనేలా ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తుందన్నారు.. బోనాల జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.

ఆషాఢ బోనాల తేదీలు ఖ‌రారు..

జూన్​ 30న గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాలు
జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
జులై 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం..
జులై 24న భాగ్యనగర బోనాలు..
జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు ఊరేగింపు..
జులై 28న గోల్కొండ బోనాలతో ముగియనున్న ఉత్సవాలు..

Related posts