టీడీపీ లో సంస్థాగతంగా సంచలన మార్పులు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. టీడీపీ మహానాడులో లోకేష్ మాట్లాడుతూ.. వరుసగా మూడుసార్లు ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టికెట్ ఇవ్వమని తెలిపారు.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు చేశాను.. ఈ సారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తానని ..ఈ విధానాన్ని నానుంచే ప్రారంభిస్తానని అన్నారు.
పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే.. ఆ తర్వాత బ్రేక్ తీసుకోవాల్సిందేనన్నారు.
ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే కొత్త రక్తం ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. ఇది తన బలమైన కోరిక అని.. ఇదే విషయంపై పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించానని వెల్లడించారు.
ఎన్నికలుఎప్పడొచ్చినా మేం రెడీ అని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 40శాతం సీట్ల కేటాయింపుల్లో వారుసులతో పాటు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని యువత కూడా ఉంటారన్నారు.
ఈ లోగా కొంత మంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తామన్నారు. పని చేయని నేతలకు, ఇన్చార్జ్లకు అవకాశాలుండవని లోకేష్ తేల్చిచెప్పారు.
మహానాడు తరువాత జగన్ చేసిన రెండు కుంభకోణాలు బయట పెట్టబోతున్నానన్న లోకేశ్.. పక్కా ఆధారాలున్నాయని ప్రకటించారు. అన్ని బయటపెడతా.. డబ్బుతోనే రాజకీయం చేయలేమని పేర్కొన్నారు.
జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారని ..ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందని లోకేష్ విశ్లేషించారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు
మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్