telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలుగుజాతి కోహినూర్ వజ్రం..నందమూరి తారక రామారావు..

నందమూరి తారక రామారావు..తెలుగు జాతికి పరిచయం అక్కర్లేని పేరు..సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానేత. తెలుగు నాట ప్రఖ్యాత ఆంధ్రుడెవరంటే ఎన్టీఆర్ పేరు తప్ప మరెవరి పేరు వినపించదు.

 

నేడు ఎన్టీఆర్ శత జయంతి…కృష్ణాజిల్లాలో పచ్చని పల్లెటూరు నిమ్మకూరు గ్రామంలో నందమూరి లక్ష్మయ్య, వెంకటరావమ్మల కుమారుడు నందమూరి తారకరామారావు.

NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ! | Balakrishna About NTR 100Th Birth Anniversary Celebrations

ఎన్టీఆర్​.. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్​ ఉన్నత పాఠశాలలో చదివారు. 1940లో మెట్రిక్యులేషన్ పూర్తయింది. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో చేరారు. ఇంటర్ చదివేటప్పుడు కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారని చెబుతారు.

1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు.

1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు.

కాలేజీలో ఉండగానే ఎన్టీఆర్​కు సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ప్రఖ్యాత దర్శకులు పుల్లయ్య కీలుగుర్రం సినిమాలో అవకాశం ఇస్తామన్నారు. అప్పుడూ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. చదువు పూర్తయ్యాకనే సినిమాల్లో వస్తానని అన్నారు.

1947 ఏప్రిల్లో ఎన్టీఆర్ డిగ్రీ పరీక్షలు ముగిశాయి. అదే నెలలో ఓ శ్రేయోభిలాషి విజయవాడ వచ్చిన ఎల్.వి.ప్రసాద్ దగ్గరకు రామారావును తీసుకెళ్లారు. మద్రాసులో స్క్రీన్ టెస్ట్ చేయించుకోమ్మని చెప్పిన ఎల్.వి.కి ఎన్టీఆర్ బదులేమిటో తెలుసా? “ఖర్చులన్నీ భరిస్తే అలాగే మద్రాసుకు వస్తానని ఆ ప్రకారమే సొమ్ము చేతికి అందిన తరువాత ఎన్టీఆర్ మద్రాసుకు ప్రయాణమయ్యారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తెలుగు తెరకు దక్కిన కోహినూర్ వజ్రం.. ఎన్టీఆర్ ఓ నట విశ్వరూపం. తెలుగు లోగిళ్లలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.

NTR 96th Birth Anniversary: Phenomenal Celluloid Achievements of the Telugu Demigod | Telugu Movie News - Times of India

ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి.. ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం.. ఏదైనా ఆయనకు నటనే ప్రాణప్రదం. ఆకర్షించే ఆహార్యం., ఆకట్టుకునే అభినయం., అలరించే గళం. సుస్వర భాస్వరం. ఇలా అన్ని కోవలలోనూ ఆయనకు ఆయనే సాటి.

కథానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన వేసిన ముద్ర అటువంటిది.ఆయనే ప్రజలంతా ప్రేమగా పిలుచుకునే ఎన్టీవోడు.

Thumbnail image

ఈ నందమూరి అందగాడు వేసినన్ని పాత్రలూ, చేసినన్ని రకాల పాత్రలూ మరే హీరో చేయలేదు. కనీసం ఆయన దరిదాపులో కూడా ఎవరూ లేరు. నాలుగున్నర దశాబ్దాల పాటు వెండితెర రారాజుగా వెలిగారు. దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయన.. ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా ‘మన దేశం’. అయితే, ‘పాతాళ భైరవి’ సినిమాతో ఆయన బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత స్టార్‌డ‌మ్‌ సొంతం అయ్యింది. కృష్ణుడు, రాముడు అంటే తెలుగు ప్రజలకు గుర్తుకు వచ్చేది విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.

1947 ఏప్రిల్లో ఎన్టీఆర్ డిగ్రీ పరీక్షలు ముగిశాయి. అదే నెలలో ఓ శ్రేయోభిలాషి విజయవాడ వచ్చిన ఎల్.వి.ప్రసాద్ దగ్గరకు రామారావును తీసుకెళ్లారు. మద్రాసులో స్క్రీన్ టెస్ట్ చేయించుకోమ్మని చెప్పిన ఎల్.వి.కి ఎన్టీఆర్ బదులేమిటో తెలుసా? "ఖర్చులన్నీ భరిస్తే అలాగే మద్రాసుకు వస్తానని! ఆ ప్రకారమే సొమ్ము చేతికి అందిన తరువాత ఎన్టీఆర్ మద్రాసుకు ప్రయాణమయ్యారు.

ఎన్టీఆర్ మొత్తం 295 సినిమాల్లో నటించారు. వీటిలో 278 తెలుగు,  14 తమిళ సినిమాలు, మూడు హిందీ సినిమాలు కూడా చేశారు. ఎన్టీఆర్ చివరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’. ఆ తర్వాత ఆయన నటించలేదు.

ఇక.. తెలుగుదేశం పార్టీని స్ధాపించి దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు. పార్టీ ప్రారంభించిన 13 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రయ్యారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు… ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింపచేసి.. ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు.

13 ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. మూడుసార్లు విజయం సాధించి.. అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్‌కు ప్రజల పాలనే తప్ప ఎమ్మెల్యేల లాలన తెలియదు. అందుకే ప్రజా సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు.

 నేడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి సంద‌ర్భంగా న‌వ్య మీడియా తెలుగుజాతి త‌రుపున స్పెష‌ల్ విసెష్ తెలియ‌జేస్తుంది….

Related posts