*ప్రభుత్వ ఆస్పత్రిలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వైద్య పరీక్షలు పూర్తి
*కాకినాడ జీజీహెచ్ దగ్గర భారీ బందోబస్తు..
*వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు
*కోర్టు సమయం ముగియడంతో మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్ట నున్న పోలీసులు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూరైయ్యాయి.
అయితే .. అనంతబాబు తరలింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మెజిస్ట్రేట్ ఎదురు హాజరుకావాల్సిండగా.. ఎస్పీ ఆఫీస్‌కు అనంతబాబును పోలీసులు తరలించారు.
కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట అనంతబాబును హజరపరచనున్నారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. కాసేపట్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు
కాగా.. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని ఒప్పుకున్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యంతో హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.. దీంతో అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.
.

