telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం..

అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు.

”శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు” అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేసారు.

ఇక ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా మే డే శుభాకాంక్షలు తెలిపారు. ”మే డే ను పురస్కరించుకుని గవర్నర్ బిశ్వభూషన్ కార్మికులకు సల్యూట్ చేస్తున్నారు.

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు చారిత్రాత్మక త్యాగాలకు, ఉద్యమాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను గుర్తుచేస్తున్నాయి. వీటివల్లే కార్మికుల ప్రస్తుతం సరయిన న్యాయం జరుగుతోంది” అని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు.

Related posts