telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో ను ప్రారంభించిన మంత్రి పొంగూరు నారాయణ

ప్రాపర్టీ షో లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, బోడే ప్రసాద్.

ఈ సందర్భం గా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని  తెలిపారు .

గత ఐదేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. భవన నిర్మాణాలు, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవో లు జారీ చేశాం అన్నారు .

10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించాం. లే అవుట్ లలో రోడ్లను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించాము 15 మీటర్ల లోపు భవనాలు నిర్మాణాలకు ఎలాంటి అనుమతి లేకుండా లైసెన్సెడ్ సర్వేయర్ కు బాధ్యతలు అప్పగిస్తున్నాం రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు.

భవన నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నాం
ప్రాపర్టీ షో లో నిర్వహణ ద్వారా కొనుగోలుదారులకు అవగాహన వస్తుంది ప్రతి ఏటా రెండు సార్లు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ల ప్రతినిధులతో సమావేశం అవుతాను ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను అని తెలిపారు.

Related posts